MLA Chevireddy Bhaskar Reddy: రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి, హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టిన చంద్రగిరి ఎమ్మెల్యే

చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (MLA Chevireddy Bhaskar Reddy) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు.

MLA Chevireddy Bhaskar Reddy (Photo-Twitter)

చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి (MLA Chevireddy Bhaskar Reddy) ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్‌ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు. స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి (YSRCP MLA Chevireddy Bhaskar Reddy) హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now