Andhra Pradesh: వీడియో, చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సేఫ్, ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా సురక్షితంగా కాపాడిన ఇండియన్ నేవీ సిబ్బంది

సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Chitravathi River Rescue Operation (Photo-Video grab)

Anantapur, Nov 19: అనంతపురం జిల్లాలో చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈరోజు ఉదయం చిత్రావతి నదిలో రాప్తాడు నియోజకవర్గంలో ని చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది వద్ద కారు గల్లంతైంది. వారిని రక్షించేందుకు స్థానికులు, ఫైర్ సిబ్బంది వెళ్లారు. అంతా కలిసి 10 మంది చిత్రావతి నదిలోని జేసీబీ పై ఉండిపోయారు. అనంతపురం జిల్లా యంత్రాంగం వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

విషయాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. సీఎం జగన్ చొరవతో ఇండియన్ నేవీ సిబ్బంది రంగంలోకి దిగారు. ఆగమేఘాలపై ప్రత్యేక హెలికాప్టర్ అనంతపురం వచ్చింది. సహాయక బృందాలు చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సురక్షితంగా కాపాడాయి. రెస్క్యూ ఆపరేషన్‌ను అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పర్యవేక్షించారు. సీఎం సత్వర స్పందనపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)