CID Raids On Margadarsi Chit Fund: ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్స్ అధికారుల ఇళ్లలో సీఐడీ తనిఖీలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు.
Vijayawada, March 11: మార్గదర్శి చిట్ ఫండ్ (Margadarsi Chit Fund) కంపెనీ మేనేజర్లు, కీలక అధికారుల నివాసాల్లో ఏపీ సీఐడీ (AP CID) సోదాలను (Raids) నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు జరుగుతున్నాయి. ఈ ఉదయం నుంచి సీఐడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కంపెనీ నిధులను మళ్లించారనే అభియోగాలతో సోదాలు జరుగుతున్నాయి. గతంలో కూడా సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. నిధుల మళ్లింపుపై సీఐడీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫిర్యాదు చేయడంతో తాజాగా సోదాలను చేపట్టారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)