Mega Covid Vaccination Drive: నేడు కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్, కృష్ణా జిల్లా వ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ జె. నివాస్
నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్ వ్యాక్సినేషన్ మెగా డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. నివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్ సిబ్బంది ఇతర హెల్త్ కేర్ వర్కర్స్‌కు వ్యాక్సిన్ అందిస్తామన్నారు. మొదటి విడత డోస్ తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్ డోస్ కోవిడ్ టీకా వేస్తామన్నారు. అర్హులైన వారందరు తమ సంబంధింత వలంటీర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్స్‌ను సంప్రదించాలని కోరారు.
ఉపాధ్యాయులందరూ కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకునేలా సోమవారం జిల్లాలోని అన్ని సచివాలయాల్లో ‘మెగా వ్యాక్సినేషన్ మేళా’ నిర్వహిస్తున్నట్లు డీఈవో తాహెరా సుల్తానా ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ నగర పరిధిలో గల అన్ని శాశ్వత వ్యాక్సినేషన్ కేంద్రాలలో సోమవారం మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు కమిషనర్ వెంకటేష్ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 22,000 కోవిషీల్డ్ డోస్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)