CPI Narayana: వీడియో ఇదిగో, క్వార్టర్ రూ.99 అని చెప్పి 180 రూపాయలకి అమ్ముతారా, వైన్స్ షాపుకి వెళ్లి ధరలను అడిగి తెలుసుకున్న సీపీఐ నారాయణ
నాణ్యమైన సారాయి.. సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ..
సరసమైన ధరలు.. నాణ్యమైన సారాయి.. అసలు సారాయే పనికిమాలినది. అందులో నాణ్యత ఏముంటుంది? అంటూ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు విసిరారు. విజయవాడ దుర్గాపురంలోని వైన్ షాపును పరిశీలించిన నారాయణ.. మద్యాన్ని ఆదాయ వనరుగా గుర్తించి సీఎం చంద్రబాబు చాలా సంతోషపడిపోతున్నారంటూ వ్యాఖ్యానించారు. అప్లికేషన్లలోనే మూడు వేల కోట్లు వచ్చాయి.. డిపాజిట్లలో మరో మూడు వేలు కోట్లు వస్తాయంటున్నారు.
మద్యం ద్వారా ఆదాయ వనరులను చూపించడం ప్రజల శ్రేయస్సు కాదు మద్యంపై సెస్సు వస్తుంది.. ఆ సెస్సుతో వచ్చిన డబ్బును రిహాబిటేషన్ సెంటర్‌కు ఖర్చుచేస్తామంటున్నారు. బాగా తాగించి.. తాగేవారికి మందు ఇచ్చి తాగనివ్వకుండా ఉండేందుకు మరొక ఖర్చు. అడుసు తొక్కనేల.. కాలు కడగనేల. తాగించడం ఎందుకు.. వారిని రీహాబిటేషన్‌కు తరలించడం ఎందుకు? ఇదంతా తలతిక్క పనులు’’ అంటూ సీపీఐ నారాయణ చురకలు అంటించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)