Cyclone Asani: తీవ్ర తుఫాన్‌గా మారిన అసని, వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాలు రద్దు, తూర్పు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు
దీంతో విమానాలను రద్దు చేశారు. వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సముద్రం అలజడిలో ఉంది. దీంతో తూర్పు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.
ముప్పుని మోసుకొస్తున్న అసని తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో విమానాలను రద్దు చేశారు. వైజాగ్ విమానాశ్రయంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాలను రద్దు చేసినట్లు ప్రకటించారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో సముద్రం అలజడిలో ఉంది. దీంతో తూర్పు తీర ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. బెంగాల్, ఏపీ, ఒడిశాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. వెదర్ సరిగా లేని కారణంగా ఇండిగో సంస్థ 23 విమానాలను రద్దు చేసినట్లు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ డైరక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మరో నాలుగు విమానాలను కూడా రద్దు చేసినట్లు ఆయన వెల్లడించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ 10 విమానాలను రద్దు చేశారు. ప్రయాణికులకు సోమవారమే సమాచారాన్ని చేరవేసినట్లు అధికారులు చెప్పారు.