Cyclone Asani: వీడియో.. విశాఖలో భారీ వర్షాలు, జలమయమైన రోడ్లు, ముప్పుని మోసుకొస్తున్న అస‌ని తీవ్ర తుఫాన్

Representational Image (Photo Credits: PTI)

విశాఖ జలమయం అయింది. రోడ్లున్న నీటితో నిండిపోయాయి. ముప్పుని మోసుకొస్తున్న అస‌ని తీవ్ర తుఫాన్‌గా మారింది. దీంతో విమానాల‌ను ర‌ద్దు చేశారు. వైజాగ్ విమానాశ్ర‌యంలో 23, చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో 10 విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం బంగాళాఖాతంలో స‌ముద్రం అల‌జ‌డిలో ఉంది. దీంతో తూర్పు తీర ప్రాంతంలో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయి. బెంగాల్‌, ఏపీ, ఒడిశాల్లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని ఐఎండీ తెలిపింది. వెద‌ర్ స‌రిగా లేని కార‌ణంగా ఇండిగో సంస్థ 23 విమానాల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ డైర‌క్ట‌ర్ శ్రీనివాస్ తెలిపారు. ఎయిర్ ఏషియాకు చెందిన మ‌రో నాలుగు విమానాల‌ను కూడా ర‌ద్దు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనూ 10 విమానాల‌ను ర‌ద్దు చేశారు. ప్ర‌యాణికుల‌కు సోమ‌వార‌మే స‌మాచారాన్ని చేర‌వేసిన‌ట్లు అధికారులు చెప్పారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)