Cyclone Mandous: పూర్తిగా నీట మునిగిన వరినాట్లు, తిరుపతి వెంకటగిరి కొండ క్రింద గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు,తుఫాన్ ప్రభావంతో ఇంకా కొనసాగుతున్న భారీ వర్షాలు
మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద నీటిలో మునిగపోయాయి.దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియలో దర్శనమిస్తున్నాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి.భారీ వర్షాల దెబ్బకు తిరుపతి వణికిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మోకాలి లోతు నీళ్లు నిలిచాయి. విద్యుత్ సరఫరా స్తంభించిపోయింది. రామానుజం సర్కిల్, జైభీం నగర్ కాలనీ, లక్ష్మీపురం సర్కిల్ సహా 12వ డివిజన్ పరిధిలో వరద నీటిలో మునిగపోయాయి.దీనికి సంబందించిన వీడియోలు సోషల్ మీడియలో దర్శనమిస్తున్నాయి.
తిరుపతి జిల్లా వెంకటగిరి కొండ క్రింద గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. వెంకటగిరి నుండి ఆల్తూరుపాడు మధ్య గొడ్డేరు చిన్న వాగు రోడ్ పై ప్రవహిస్తుండటం తో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వెలుగొండ అడవి ప్రాంతం లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఇప్పటివరకు భారీవర్షాలు కురిసిన నేపథ్యం లో గ్రామాలలోని చెరువు నిండుకుండలా మారాయి, కలుజులు పొంగిపొర్లుతున్నాయి పంటపొలాలు, వరినాట్లు పూర్తి గా నీటమునగడం తో రైతులకు నష్టం వాటిల్లింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)