Dwaraka Tirumala Rao: ఏపీ పోలీస్ బాస్‌గా ద్వారకా తిరుమలరావు, పోలీసు దళాల అధిపతిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది
ఏపీ రాష్ట్ర నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన్ను కో ఆర్డినేషన్ విభాగం డీజీపీగా నియమించి పోలీసు దళాల అధిపతిగా (హెచ్‌ఓపీఎఫ్)గా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారుల సీనియారిటీ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. వీడియో ఇదిగో, అమరావతి శంకుస్థాపన ఏరియాలో నేలపై మోకరిల్లి నమస్కరించిన సీఎం చంద్రబాబు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేవీ రాజేంద్రనాథరెడ్డిపై బదిలీ వేటు వేసిన ఎన్నికల సంఘం... హరీష్‌కుమార్ గుప్తాను డీజీపీగా నియమించింది. మే 6న డీజీపీగా బాధ్యతలు చేపట్టిన హరీష్‌కుమార్ గుప్తా దాదాపు నెలన్నర పాటు ఆ పోస్టులో కొనసాగారు.తాజాగా ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)