Gajuwaka Fire Video: విశాఖ గాజువాకలో ఘోర అగ్ని ప్రమాదం, మంటల్లో కాలిపోయిన మూడు ఫ్లోర్లు, భారీగా ఆస్తి నష్టం, మంటలను అదుపు చేస్తున్న ఫైర్‌ ఇంజిన్లు

కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి.

Fire (Photo-Video Grab)

విశాఖలోని గాజువాకలో ఉన్న ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. కమర్షియల్ కాంప్లెక్స్‌లో మూడు ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాద తీవ్రత అంతకంతకూ పెరుగుతున్నట్లు సమాచారం. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. బిల్డింగ్‌ వెనుక నివాసాలుండటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఫైర్‌ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Here's ANI Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)