Floating Bridge Washed Away: ఒక్కరోజుకే తెగిపొయిన విశాఖ ఫ్లోటింగ్ బ్రిడ్జ్, సందర్శకులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం, వైసీపీని దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
విశాఖపట్నంలో ఆర్కే బీచ్ లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చే ప్రజలకు ఉత్సహాన్ని ఇచ్చేందుకు గాను సముద్రపు అలల తాకిడిని ఆస్వాదించేందుకు ఫ్లోటింగ్ బ్రిడ్జి ని ఏర్పాటు చేశారు. దీనిని ఆ రాష్ట్ర ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ కలిసి శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. అట్టహాసంగా ఆదివారం ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సోమవారం తెగిపోయింది. ఒక ముక్క విడిపోయి సముద్రంలో దూరంగా కొట్టుకుపోయింది. ఆ సయమంలో సందర్శకులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
దీంతో సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏర్పాటు చేసిన ఒక్కరోజులోనే ఇలా తెగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే.. రాత్రి ఈ ఘటన జరగడంతో ఎటువంటి అపాయం జరగలేదని.. ఒక వేళ దానిపై ఎవరైనా ఉన్న సమయంలో అలా జరిగితే ప్రాణ నష్టం జరిగిదేని ప్రజలు మండిపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో.. ఏదో చేసినట్లు పోస్టర్లు కట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తోందని సోషల్ మీడియా వేదికగా వైసీపీని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)