Kiran Kumar Reddy Quits Congress: బీజేపీ తీర్థం పుచ్చుకోనున్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం.
ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.త్వరలో ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి బీజేపీలో చేరుతారని సమాచారం. ఏపీ విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇటీవల మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీ విభజన అనంతరం సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. అయితే తర్వాత ఎన్నికల్లో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2014 ఎన్నికల్లో ఘోర పరాభావం తర్వాత కాంగ్రెస్‌లో మళ్లీ చేరారు. ఆ తర్వాత పార్టీకి పూర్వవైభవం తెస్తారని భావించినా.. ఆయన అంటీముట్టనట్టుగానే వ్యవహరించారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)