Venkata Ramana Joins YSRCP:కైకలూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌, వైసీపీ తీర్థం పుచ్చుకున్న కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ

Jayamangala Venkata Ramana (Photo-Twitter)

ఏలూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌ తగిలిందనే చెప్పొచ్చు. ఆ పార్టీకి కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ గుడ్ బై చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు నచ్చి.. వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు ప్రకటించేశారు. కైకలూరులో బహిరంగ సభ నిర్వహించి ప్రజా సమక్షంలోనే ఆయన తన రాజీనామా ప్రకటన చేయడం గమనార్హం. ఈ సందర్భంగా.. ఆయన మాట్లాడుతూ..నియోజకవర్గ అభివృద్ధి,కొల్లేటి వాసుల జీవన ప్రమాణాల మెరుగు కోసమే పార్టీ మారేందుకు నిర్ణయించుకున్నా. నాతో పాటు వచ్చే నేతలను వైఎస్సార్‌సీపీలోకి తీసుకెళ్తా అని ప్రకటించారు.

Here's Update News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement