Fumes in Vande Bharat Train: వీడియో ఇదిగో, వందే భారత్ టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు, ఆందోళనకు గురైన ప్రయాణికులు

వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

Fumes in Vande Bharat train between Gudur - Manubolu

వందే భారత్ ట్రైన్ లో పోగలు వెలువడ్డాయి. తిరుపతి-హైదరాబాద్ వందేభారత్ రైలులో ఈ ఘటన జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న వందే భారత్ రైలులో పొగలు వెలువడ్డాయి. రైలు టాయిలెట్‌లో ఓ వ్యక్తి సిగరెట్ తాగడంతో రైలు నిండా పొగలు కమ్ముకున్నాయి. గూడూరు-మనుబోలు మధ్య రైలును నిలిపివేశారు. వెంటనే స్పందించిన రైల్వే అధికారులు మరమ్మతులు చేపట్టారు. పొగలు వెలువడడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.

మూడో బోగీలోని బాత్‌రూమ్‌ నుంచి పొగలు రావడంతో సిబ్బంది వెళ్లి పరిశీలించారు. బాత్‌రూమ్‌లో కాల్చి పడేసిన సిగరెట్ ముక్క ప్లాస్టిక్‌ సామగ్రికి అంటుకోవడం వల్లే పొగ వ్యాపించిందని నిర్ధరించారు. ఈ ఘటనకు బాధ్యుడైన టికెట్‌ లేని ప్రయాణికుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిబ్బంది మంటలను పూర్తిగా ఆర్పివేసి రైలును పంపివేశారు. దీంతో అరగంటకుపైగా రైలు నిలిచిపోయింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Fumes in Vande Bharat train between Gudur - Manubolu

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement