Pawan Kalyan on Sanatana Dharma: వీడియోలు ఇవిగో, సనాతన ధర్మం కోసం చనిపోవడానికైనా రెడీ, పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
కొన్ని దశాబ్ధాలుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదని చెప్పారు. హిందువుల నమ్మకాలపై నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించరని తెలిపారు.
వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలన్నారు. తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా బెజవాడ దుర్గమ్మ గుడి మెట్లు శుద్ధి చేసిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
సనాతన ధర్మం కోసం పోరాటం మొదలుపెడితే తాను చనిపోవడానికి కూడా సిద్ధమేనని పవన్ కల్యాణ్ ప్రకటించారు. కొన్ని దశాబ్ధాలుగా హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. మౌనంగా ఉన్నామంటే బాధ లేదని కాదని చెప్పారు. హిందువుల నమ్మకాలపై నోటికి వచ్చినట్టు అడ్డగోలుగా మాట్లాడితే ఎవరూ క్షమించరని తెలిపారు. సగటు హిందువుకు ఎప్పుడూ ఇతర మతాలవారిపై ధ్వేషం ఉండదని వెల్లడించారు. వైసీపీ నేతలు తనపై చేస్తున్న విమర్శలకు ఇప్పటికీ సహిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)