Jagan Ballot Box Tweet Row: దమ్ముంటే రాజీనామా చేసి రా, బ్యాలెట్ పేపర్లతోనే నువ్వో నేనే తేల్చుకుందాం, జగన్‌కు సవాల్ విసిరిన టీడీపీ నేత బుద్దా వెంకన్న
ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. జగన్‌కు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాలు విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని పేర్కొన్నారు.

ఈవీఎంలపై జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా విరుచుకుపడుతున్నారు. జగన్‌కు ఏమాత్రం దమ్ము, ధైర్యం ఉన్నా వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న సవాలు విసిరారు. బ్యాలెట్ విధానంలోనే ఉప ఎన్నిక పెట్టాలని ఈసీని కోరుదామని పేర్కొన్నారు. ఉప ఎన్నిక అంటూ జరిగితే ఇప్పుడు వచ్చినంత మెజార్టీ కూడా రాదని పేర్కొన్నారు. పులివెందుల ప్రజలే జగన్‌ను ఓడిస్తారని చెప్పారు. ఆయన ఇకనైనా చిలుక జోస్యాలు చెప్పడం మానుకోవాలని వెంకన్న హితవు పలికారు. ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలి.. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లనే వాడుతున్నాయి.. మనమూ ఆ దారిలోనే వెళ్లాలి.. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ట్వీట్
జగన్ ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇకపై ఎన్నికల్లో బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. జగన్ ట్వీట్‌తో టీడీపీ నేతలు ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. గత ఎన్నికల సమయంలో ఈవీఎంలకు వంతపాడుతూ మీడియాతో జగన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కేవలం 11 సీట్లలోనే విజయం సాధించింది.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)