Jagan Mohan Reddy

Vijayawada, June 18: ఈవీఎంలలో (EVM) అక్రమాలు జరిగాయని, వాటిని హ్యాకింగ్ (Hacking) చేయవచ్చన్న విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో  ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌ రెడ్డి (YS Jagan) మంగళవారం ఉదయం సంచలన ట్వీట్ చేశారు. ఈవీఎంలపై నమ్మకం సన్నగిల్లుతున్న వేళ పేపర్‌ బ్యాలెట్లు ఉప‌యోగించ‌డం మంచిద‌ని ఆయ‌న త‌న ట్వీట్‌లో వెల్లడించారు. ‘న్యాయం జరగడం మాత్రమే కాదు, అది వాస్తవంగా కనిపించాలి. అలాగే ప్రజాస్వామ్యం బలంగా ఉండటమే కాకుండా అనుమానాలకు తావులేకుండా కనిపించాలి. ప్రపంచవ్యాప్తంగా అన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో నిర్వహిస్తున్న ఎన్నికల్లో ఈవీఎంలు కాకుండా పేపర్ బ్యాలెట్లు మాత్రమే ఉపయోగిస్తున్నారు. మన ప్రజాస్వామ్య నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలి’ అని జగన్ ట్వీట్ చేశారు.

తెలంగాణలో ఒకేసారి భారీ సంఖ్యలో ఐపీఎస్ లకు స్థానచలనం.. ఏకంగా 28 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ... వివరాలు ఇవిగో!

భారత్ లో మళ్లీ బ్యాలెట్ రావాలని..

భారత్ లో కూడా గతంలో ఉపయోగించిన పేపర్ బ్యాలెట్ విధానాన్ని మళ్లీ తెరమీదకు తీసుకువచ్చి, ఎన్నికల్లో బ్యాలెట్ లనే వాడాలని జగన్ తన ట్వీట్ లో అభిప్రాయపడ్డారు. ఈవీఎంలపై చర్చ జరుగుతున్న వేళ జగన్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

తెల్ల రేషన్ కార్డుదారులకు ఏపీ సర్కారు శుభవార్త.. రేషన్ మీద బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార సరఫరా.. జూలై 1 నుంచి పంపిణీ