Jai Telugu Party: ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ, జై తెలుగు పేరుతో పార్టీని ప్రారంభించిన సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం
తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.
ఏపీలో ఎటువంటి చడీ చప్పుడు లేకుండా కొత్త పార్టీ ఆవిర్భవించింది. తెలుగు భాషా పరిరక్షణ కోసం అంటూ జై తెలుగు పార్టీని కవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు.తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నానని, రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడమే తన లక్ష్యమని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయిందని, భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయిందన్నారు. ఈ విలువల కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పనిచేయాలన్నారు. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించానని జొన్నవిత్తుల తెలిపారు. నీలం రంగు జలం, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలన్నారు. వెనుక తెలుగు భాష రథాన్ని ప్రజలు లాగాలనేది తన ఆకాంక్షగా జొన్నవిత్తుల చెప్పుకొచ్చారు. ఆగస్ట్15 నాటికి తమ పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామన్నారు. తెలుగు భాషా పరిరక్షణ అజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తామని జొన్నవిత్తుల ప్రకటించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)