Avinash Reddy Parents Hospitalized: అవినాష్ రెడ్డి తల్లిదండ్రులిద్దరికీ తీవ్ర అస్వస్థత, తండ్రి భాస్కర్‌ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్న జైలు అధికారులు

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

MP Avinash Reddy (Photo-Video Grab)

కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో, వైఎస్‌ శ్రీలక్ష్మికి కర్నూలు ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్‌ ఇచ్చారు. అయితే, మెరుగైన వైద్య సేవల కోసం శ్రీలక్ష్మిని హైదరాబాద్‌లోని ఏఐజీ తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ ప్రసాద్‌ రెడ్డి ఆధ్వర్యంలో ఆమెకు చికిత్స అందుతోంది. ఇక, ఎంపీ అవినాష్‌ రెడ్డి కూడా ఏఐజీ ఆసుపత్రిలోనే ఉన్నారు.

ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం, నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ, చంద్రబాబును నమ్మకూడదని తెలిపిన సీఎం జగన్‌

మరోవైపు.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అనంతరం, కోర్టు భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌ విధించడంతో చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ క్రమంలో భాస్కర్‌ రెడ్డికి శుక్రవారం బీపీ పెరగడంతో జైలు అధికారులు వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఉస్మానియా వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం భాస్కర్‌ రెడ్డిని రేపు నిమ్స్‌కు తరలించనున్నారు జైలు అధికారులు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now