Navaratnalu-Pedalandariki Illu: ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితం, నరకాసురుడినైనా నమ్మొచ్చు కానీ, చంద్రబాబును నమ్మకూడదని తెలిపిన సీఎం జగన్‌

Amaravati, May 26: దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది. ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు.శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్‌ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు.

పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన.

అమరావతిలో పేదల పండుగ, 50,793 మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ, నవ­రత్నా­లు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద అందజేసిన సీఎం జగన్

ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్‌ ప్రకటించారు.

దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని, జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారాయన.

వివేకా హత్య కేసు, అవినాష్ రెడ్డికి మద్ధతు ప్రకటించిన కేఏ పాల్, కడప ఎంపీకి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నానని వెల్లడి

ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్‌ ప్రకటించారు.

సీఎం చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని.. దొంగల ముఠా  పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే యత్నం చేసింది.  చంద్రబాబు హయాంలో పేదలకు సెంటు భూమి ఇవ్వలేదు. ఇళ్ల స్థలాల విషయంలోనూ మోసమే చేశారు.  2014 నుంచి 2019 వరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదు. తన హయాంలో చంద్రబాబు అన్ని వర్గాలనూ మోసం చేశారు. ఎన్నికలు రాగానే మళ్లీ మోసపూరిత హామీలు ఇస్తారు. మళ్లీ మోసపూరిత ప్రేమ చూపడానికి బాబు సిద్ధమవుతున్నారు. గజ దొంగల ముఠా ఏకమవుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలనంతా దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే.

గతంలో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టో విడుదల చేసి, అందర్నీ మోసం చేశాడు. ఎన్నికలకు దగ్గరపడే కొద్దీ.. మళ్లీ ఒక మేనిఫెస్టో అంటాడు. సామాజిక వర్గాలు మీద మోసపూరిత ప్రేమ చూపిస్తాడు. వారికోసమే మేనిఫెస్టో అని చంద్రబాబు అంటాడు. మోసం చేసేవాడ్ని ఎప్పుడూ కూడా నమ్మకండి. నరకాసురుడినైనా నమ్మొచ్చు కాని, నారా చంద్రబాబునాయుడ్ని మాత్రం నమ్మకూడదు అంటూ ప్రజలను  ఉద్దేశించి సీఎం జగన్‌ పిలుపు ఇచ్చారు.

 

మంచి చేసే ప్రభుత్వం ఇది

కోవిడ్‌ కష్టకాలంలోనూ ఎక్కడా రాజీపడలేదు. అక్కచెల్లెమ్మల కుటుంబాల కోసం పని చేశా. కోవిడ్‌ సమయంలోనూ 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. నవరత్నాల్లోని ప్రతీ హామీని అమలు చేశాం. మ్యానిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించాం.  ఇచ్చిన 98 శాతం హామీలను అమలు చేశాం. ఈ నాలుగేళ్లలో అవినీతి, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. డీబీటీ ద్వారా నేరుగా రూ. 2.11 లక్షల కోట్లు అందజేశాం.

నాన్‌ డీబీటీతో మొత్తం రూ. 3 లక్షల కోట్లు అందించాం. ఇంత మంచి జరుగుతుంటే.. గజ దొంగల ముఠా చూడలేకపోతోంది. చంద్రబాబు, ఈనాడు, ఏబీఎన్‌, టీవీ5.. వీళ్లకు తోడు దత్తపుత్రుడు గజదొంగల ముఠా ఏకమవుతోంది. పేదలకు మంచి చేయాలనే ఆలోచన వీళ్లకు లేదు. ఈ నాలుగేళ్ల మీ బిడ్డ పరిపాలనలో ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేదు. మా అక్క చెల్ల్మెల కుటుంబాల ఖాతాల్లోకి రూ.2.11లక్షల కోట్లు జమచేశాం. అప్పుల వృద్ధిరేటు చూస్తే… గత ప్రభుత్వం కన్నా.. తక్కవే. మరి చంద్రబాబు హయాంలో ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు జరగలేదు?. ఎందుకంటే.. వారికి మంచి చేసే ఉద్దేశం లేదు కాబట్టి.

ఆ దొంగల ముఠా దృష్టిలో అధికారంలోకి రావడం అంటే.. దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి మాత్రమే. దారుణాలను వాళ్లు రాయరు, చూపరు, ప్రశ్నిస్తామన్న వాళ్లు ప్రశ్నించరు. ఇదీ చంద్రబాబు హయాంలో మాయ. ఈరోజు కులాల మధ్య యుద్ధం జరగడంలేదు, జరుగుతున్నది క్లాస్‌ వార్‌. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపే పేదవాళ్లకు మంచి జరగకూడదని కోరుకుంటూ పెత్తందార్లు యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్లస్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి యుద్ధం చేస్తారు. సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని వాదనలు చేశారు. జగన్‌ మాదిరిగా పాలన చేస్తే.. రాష్ట్రం శ్రీలంక పోతుందని ఎల్లోమీడియాలో రాస్తారు.. చూపుతారు. పేదల బ్రతులకు మారాలని పరితపిస్తున్న ప్రభుత్వం మనది అని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు.