Navaratnalu-Pedalandariki Illu: అమరావతిలో పేదల పండుగ, 50,793 మంది పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ, నవ­రత్నా­లు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద అందజేసిన సీఎం జగన్
CM YS Jagan (Photo-Twitter/AP/CMO)

Amaravati, May 26: సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) పరిధిలో 50,793 మంది పేదలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్ర­వారం (నేడు) ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెంలో ఏర్పాటుచేసిన వేదిక వద్ద ‘నవ­రత్నా­లు–­పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఈ పట్టాలను అందజేశారు.

ఈ ప్రాంతంలో 1,402.58 ఎకరాల్లో ఆర్‌–5 జోన్‌ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధంచేశారు. వీటితో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్ అందజేస్తారు. ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది వివిధ శాఖ అధికారులు, యానిమేటర్లు, డ్వాక్రా మహిళలు ఆహ్వానం అందించారు. వారి ఇళ్లకు వెళ్లి బొట్టుపెట్టి మరీ కార్యక్రమానికి రావాలని పిలిచారు.

వివేకా హత్య కేసు, అవినాష్ రెడ్డికి మద్ధతు ప్రకటించిన కేఏ పాల్, కడప ఎంపీకి న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నానని వెల్లడి

సీఆర్డీఏ పరిధిలో సిద్ధంచేసిన 25 లేఅవుట్లలో గుంటూరు జిల్లాకు చెందిన 23,762 మంది, ఎన్టీఆర్‌ జిల్లాకు చెందిన 27,031 మంది నిరుపేద లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ప్రతి ప్లాట్‌కు హద్దులు నిర్ణయిస్తూ 80 వేల హద్దు రాళ్లు ఏర్పాటుచేశారు. అంతర్గత రవాణా కోసం 95.16 కి.మీ పరిధిలో గ్రావెల్‌ రోడ్లు వేశారు.

Videos

నిడమర్రు, మందడం, అనంతవరం, దొండపాడు, ఐనవోలు, పెనుమాక, తుళ్లూరు, నవులూరులో అన్ని వసతులతో రూ.443.71 కోట్లతో నిర్మించిన 5,024 టిడ్కో ఇళ్లను పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,43,000 మంది నిరుపేద లబ్ధిదారులకు 300 చ.అడుగుల టిడ్కో ఇళ్లను అన్ని హక్కులతో కేవలం రూ.1కే రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. తద్వారా వారికి రూ.9,406 కోట్ల మేర లబ్ధి చేకూరనుంది.

ఏపీలో 1000 ఏపీపీఎస్సీ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్, గ్రూప్‌-1, 2 ఉద్యోగాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

2.62 లక్షల మంది టిడ్కో లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ.14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల కోసం మరో రూ.1,200 కోట్లు, మౌలిక సదుపాయాలకు రూ.3,000 కోట్లు మొత్తం రూ.18,714 కోట్ల లబ్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేకూర్చింది. ఈ ఇళ్ల పట్టాలు పంపిణీలో ఏమైనా ఇబ్బందులుంటే 1902 టోల్‌ఫ్రీ నంబర్‌లో సంప్రదించవచ్చు.