Rahul Gandhi on YSR: వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేది, రాహుల్ గాంధీ సంచలన వీడియో ఇదిగో, ఆయనను కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటంటూ..
ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు.
నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ బతికి ఉంటే ఏపీ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ఆయనను కోల్పోవడం రాష్ట్ర ప్రజలకు తీరని లోటని చెప్పారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని షర్మిల కొనసాగిస్తారని ఈ సందర్భంగా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన భారత్ జోడో యాత్రకు ఒక రకంగా వైఎస్ఆర్ పాదయాత్ర స్ఫూర్తి అని అన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి నేడు.. వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ భారతి నివాళులు
ప్రజానీకానికి నిజమైన నాయకుడని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, భారతదేశ ప్రజల అభ్యున్నతి, సాధికారత పట్ల ఆయన అంకితభావం, నిబద్ధత చాలా మందికి మార్గదర్శకమన్నారు. వ్యక్తిగతంగా ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజా జీవితానికే ప్రాధాన్యతనిచ్చిన మహా నాయకుడని రాహుల్ కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటున్నట్లు తెలిపారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)