Nara Lokesh vs Anil Kumar Yadav: నేను ప్రమాణం చేశాను, నీకు ప్రమాణం చేసే దమ్ముందా, నారా లోకేష్‌కు సవాల్ విసిరిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్

తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.

Nara Lokesh vs Anil Kumar Yadav

నెల్లూరు జిల్లా వెంకటేశ్వరపురంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్‌ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్‌ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు.

‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేష్‌ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా?. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది?. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అనిల్‌ పేర్కొన్నారు.

కాగా యువగళం పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎన్. లోకేష్ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి. అనిల్ కుమార్ యాదవ్ అక్రమంగా ₹1,000 కోట్ల ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు.

Nara Lokesh vs Anil Kumar Yadav

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)