Dada Oxygen Park: మహారాష్ట్రలో సీఎం జగన్ మీద వెలువెత్తిన అభిమానం, లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరిట దాదాశ్రీ ఫౌండేషన్ వీఈటీ తరపున మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలోని 11 తాలూకాలోని అన్ని గ్రామాల్లో, పాఠశాలల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (దాదాశ్రీ) ఆక్సిజన్ పార్క్ ప్రచారం ద్వారా మొక్కలు నాటుతున్నారు. షోలాపూర్ జిల్లాలో దాదాపు 4800 పాఠశాలలున్నాయి. ప్రతి పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. మొత్తం లక్షా 11 వేల 111 మొక్కలు నాటనున్నారు.ఈ కార్యక్రమాన్ని ఐఏఎస్ అధికారి బాలాజీ మంజులే ప్రారంభించారు. కాకాసాహెబ్ లక్ష్మణ్ కాక్డే నేతృత్వంలోని సీఎం జగన్ దాదాశ్రీ ఫౌండేషన్ అభినందనీయమని, మొక్కల పెంపకం ఒక ఉద్యమంలా సాగాలని, దీని వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని బాలాజీ మంజులే అభిప్రాయపడ్డారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)