Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు

Man catches snake with bare hands in Visakhapatnam bank

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు. అలాగే బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు కూడా పాము సంగతి తెలిసి బ్యాంకు బయటకు పరుగులు తీశారు.బ్యాంకు సిబ్బంది వెంటనే పాములు పట్టే స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న కిరణ్ అనే స్నేక్ క్యాచర్.. చాకచక్యంగా ఆ పామును బంధించాడు. అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వదిలి పెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement