Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు

ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి.

Anil kumar Yadav (photo-Video Grab)

ఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి. అపార్ట్మెంట్ రూల్స్ కు విరుద్ధంగా ఇక్కడ పార్కింగ్ చేయకూడదు అని చెప్పిన కారణంగా సెక్యూరిటీ సిబ్బందిని ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తన మనుషులతో చావ చితక్కొట్టించారని సమాచారం.

ఈ తతంగమంతా అపార్ట్ మెంట్ వాసులు చిత్రీకరించగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు తాగి వచ్చి సిబ్బందిని కొట్టారని అపార్ట్ మెంట్ లో పలువురు చెబుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now