MLA Kotamreddy Sridhar Reddy: దటీజ్ ఎమ్మెల్యే, జోరు వానలో రోడ్డు మధ్యలో ఇరుక్కుపోయిన కారును ముందుకు నెట్టి దారి క్లియర్ చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి
ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి మానవవత్వాన్ని చాటుకొన్నారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు.
ప్రజా సమస్యల మీద అలుపెరగని పోరాటం చేస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకొన్నారు. వర్షంలో తడుస్తూనే తనవంతు సహయ సహకారం అందించి అందరి మన్ననలు పొందారు. తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షానికి నిత్యం రద్దీగా ఉండే నెల్లూరులోని మాగుంటలే అవుట్ అండర్ బ్రిడ్జిలోకి మోకాళ్లలోతు నీరు చేరింది.
ఓ పెళ్లకి హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే కోటంరెడ్డి బ్రిడ్జి ముందే ఆగిపోయారు. కార్పొరేషన్ అధికారులకు విషయం చెప్పి మోటార్లతో నీటిని తోడేయాలని ఆదేశించారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండటం ముహూర్తానికి టైం అయిపోతుండటంతో సాహసం చేసిన ఇద్దరు వాహన చోదకులు బ్రిడ్జి దాటే ప్రయత్నం చేసి మధ్యలో ఇరుక్కు పోయారు.దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్షంలో తడుస్తూనే తన అనుచరులతో కలిసి నీటిలో ఆగిపోయిన వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగటంతో మిగిలిన వాళ్లు కూడా ముందుకొచ్చారు. బాధ్యతగా మసులుకొన్న ఎమ్మెల్యేకి చేతులెత్తి నమస్కరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)