Andhra Pradesh: ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్, వైసీపీ ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలు..మూడు టీడీపీ ఖాతాలోకే!
వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
ఏపీలో రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. వైసీపీ నుండి రాజ్యసభ ఎంపీలుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాతో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం.
డిసెంబర్ 3 నుంచి 10 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీన ఉప సంహరణ ఉండనుంది. డిసెంబర్ 20న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్, అదేరోజు లెక్కింపు ఉండనుంది.
ఎంపీలుగా రాజీనామా చేసిన వెంకటరమణ, బీద మస్తాన్‌రావు ..ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరగా కృష్ణయ్య తటస్థంగా ఉన్నారు. ఈ మూడు స్థానాలు టీడీపీ ఖాతాలోకే వెళ్లనున్నాయి. కేంద్రమంత్రి షెకావత్‌తో డిప్యూటీ సీఎం పవన్ భేటీ, టూరిజం హబ్‌గా ఏపీ..కేంద్రం సాయంతో పలు పర్యాటక ప్రాజెక్టులు రాబోతున్నాయని వెల్లడించిన పవన్ కళ్యాణ్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)