TTD: పరకామణి కుంభకోణంపై చర్చ, స్కాంపై చర్చ జరపాలని డిమాండ్ చేసిన బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి
తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి.
తిరుమలలో మరోసారి పరకామణి కుంభకోణం చర్చ జరుగుతోంది. పరకామణిలో రహస్యంగా రూ.200 కోట్లకుపైగా విదేశీ కరెన్సీ తరలించాడు రవికుమార్ అనే పెద్దజీయర్ మఠం ఉద్యోగి. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన అతనిపై కేవలం రూ.78 వేల విలువైన డాలర్లు దొరికాయని కేసు నమోదు చేశారు పోలీసులు.
హుండీ కానుకగా తిరుపతిలోని 14 ప్లాట్లను టీటీడీకి రాసిచ్చారు రవికుమార్, ఆయన భార్య రమ్య రవికుమార్. వీటితో పాటు అతని ఆస్తులను అప్పటి టీటీడీ అధికారులు, పాలకమండలి, పోలీసులు తమ సొంతానికి రాయించుకున్నారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. విజిలెన్స్ నివేదికలో పోలీసుల ఒత్తిడి వల్లే కేసులో రాజీ అయినట్లు వెల్లడించారు. దీనిపై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని కోరారు భానుప్రకాష్ రెడ్డి. వీడియో ఇదిగో, చంద్రగిరిలో అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తున్న ఆర్టీసీ కండక్టర్‌పై దాడి చేసిన దుండగులు, పరిస్థితి విషమం