Times Now ETG Survey: సర్వే మళ్లీ జగన్ వైపే, 2024లో టీడీపీ, జనసేన గల్లంతేనంటున్న టైమ్స్ నౌ సర్వే, 23 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో జగన్ సర్కారు గెలుస్తుందని సర్వేలో వెల్లడి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ టైమ్స్ నౌ సర్వే బయటకు వచ్చింది. తాజా సర్వేలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 24 నుంచి 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయభేరి మోగిస్తుందని తెలిపింది. ఇక ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వేలో వైఎస్సార్‌సీపీ ఏకపక్షంగా విజయం సాధిస్తుందని తేలిన విషయం తెలిసిందే. జూన్ 15– ఆగస్టు 12వ తేదీ మధ్య తాజాగా మరోసారి నిర్వహించిన సర్వేలోనూ అవే ఫలితాలు పునరావృతమయ్యాయని తెలిపింది. ఏప్రిల్‌లో జరిగిన సర్వే, తాజా సర్వే ఫలితాల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.
2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ 49.8 శాతం ఓట్లతో 22 స్థానాల్లో నెగ్గింది. ఈసారి 51.3 శాతం ఓట్లతో మొత్తం స్థానాలను తన ఖాతాలో వేసుకుంటుందని టైమ్స్ నౌ సర్వే తేల్చడం విశేషం. అంటే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు ఆ పార్టీ ఓట్ల శాతం 1.50 శాతం పెరుగనున్నట్లు స్పష్టమవుతోంది.
Here's Survey Report