Rave Party In Konaseema: కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం.. యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు.. కేసు నమోదు చేసిన పోలీసులు (వీడియో)
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Konaseema, Jan 3: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేవ్ పార్టీ (Rave Party) కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేడుకల్లో రేవ్ పార్టీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గొల్లపుంత రోడ్ లో ఉన్న బుద్ధా స్టాట్యూ ఓం సిటీ లేఔట్లో యువతులతో అసభ్య నృత్య ప్రదర్శనలు చేయించి రేవ్ పార్టీ చేసుకున్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది. జనసేన (Janasena) నేత వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో ఈ పార్టీ జరిగినట్టు చెప్తున్నారు. ముత్తుతో పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)