Chandrababu Arrest Row: వీడియో ఇదిగో, ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది అంటూ కంటతడిపెట్టిన చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారని ఆవేదన

చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారు. చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే నా మనసు చలించింది. ఆయన కోసం నా ఆత్మ వదిలేసి వచ్చా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది.. ధైర్యంగా ఉన్నారు. చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది

Chandrababu Family Photo (photo-Video Grab)

టీడీపీ అధినేత చంద్రబాబు భద్రతపై తనకు భయంగా ఉందని ఆయన సతీమణి భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం జైలులో మంగళవారం సాయంత్రం చంద్రబాబును భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి కలిశారు అనంతరం జైలు వద్ద భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ... జైలు నంచి త్వరగా బయటకు వచ్చి ప్రజాసేవ చేస్తానని చంద్రబాబు అన్నారు. ప్రజలే తనకు ముఖ్యమని ఆయన ఎప్పుడూ అనేవారు. ప్రజల హక్కుల కోసమే పోరాటం చేస్తున్నారు. తాను బాగున్నానని.. ఎవరూ భయపడవద్దని చంద్రబాబు చెప్పారు.

చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌ కొట్టివేసిన ఏసీబీ కోర్టు,  జైల్లో పూర్తి స్థాయి భద్రత కల్పించామనే సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం

మా కుటుంబం ఎప్పుడూ ప్రజలు, క్యాడర్‌ కోసం నిలుస్తుంది. ఎన్టీఆర్‌ పెట్టిన పార్టీ ఇది ..ఏమీ కాదు. ప్రజలే తనకు ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ అనే వారు. మన రాష్ట్రం.. దేశంలో నెంబర్‌వన్‌గా ఉండాలని అనేవారు. మా కుటుంబ సభ్యులకు ఇది చాలా కష్టకాలం. రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబుకు అండగా ఉండాలి’’ అని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు నిర్మించిన భవనంలోనే ఆయన్ను తీసుకెళ్లి పెట్టారు. చంద్రబాబును వీడి బయటకు వస్తుంటే నా మనసు చలించింది. ఆయన కోసం నా ఆత్మ వదిలేసి వచ్చా. ఇలాంటి పరిస్థితులు వస్తాయని ఊహించలేదు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉంది.. ధైర్యంగా ఉన్నారు. చన్నీళ్ల స్నానం చేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితి చాలా దారుణం. ఇది మాకు ఒక సవాల్‌’’ అంటూ భువనేశ్వరి కన్నీటి పర్యంతమయ్యారు.

Chandrababu Family Photo (photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Supreme Court: నేరం రుజువు కావాలంటే నిందితుడు బహిరంగంగా దూషించాలి.. నాలుగు గోడల మధ్య జరిగితే కేసు నిలబడదు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Bengaluru Horror: దారుణం, మదర్సాలో బాలుడిపై టీచర్ పదే పదే అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపులు, చివరకు తల్లిదండ్రులకు ఘోరాన్ని చెప్పిన బాలుడు

Supreme Court: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై సుప్రీంలో విచారణ, ఇంకెంతకాలం గడువు కావాలని స్పీకర్‌ను ప్రశ్నించిన సుప్రీం కోర్టు..తదుపరి విచారణ వాయిదా

GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ

Share Now