Supreme Court: కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి, ఏపీ సర్కారుకు ఆదేశాలు జారీ చేసిన సుప్రీంకోర్టు, రాష్ట్రంలో కరోనాతో 14 వేల మందికి పైగా మృతి
కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం అందజేయని అంశాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో 14 వేల మందికి పైగా కరోనాతో మృత్యువాత పడ్డారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలు దయనీయ స్థితిలో చిక్కుకున్నారు.ఈ నేపథ్యంలో, ఏపీలో కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించడంలేదంటూ పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కరోనా మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. నష్టపరిహారం అందజేయని అంశాన్ని పరిశీలించాలంటూ ఏపీ స్టేట్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ అథారిటీకి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)