Vishal on AP Politics: కుప్పం నుంచి నేను పోటీ చేయడం లేదు, అసలు ఏపీ రాజకీయాల్లోకే రావడం లేదు, క్లారిటీ ఇచ్చిన నటుడు విశాల్
ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారంటూ గడచిన కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ అభ్యర్థిగా తమిళ నటుడు విశాల్ పోటీ చేయబోతున్నారంటూ గడచిన కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను ఖండిస్తూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం క్లారిటీ ఇచ్చారు. తాజాగా విశాల్ కూడా ఈ వార్తలపై స్పందించాడు. ఏపీ రాజకీయాల్లోకి తాను త్వరలోనే ఎంట్రీ ఇస్తున్నట్లు, కుప్పంలో చంద్రబాబుపై పోటీకి దిగుతున్నట్టు వినిపిస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని విశాల్ ప్రకటించాడు.
ఈ వ్యవహారం గురించి తనకు అసలే తెలియదని, ఈ దిశగా ఇప్పటిదాకా తనను ఎవరూ సంప్రదించలేదని కూడా అతడు తెలిపాడు. అసలు ఈ వార్తలు ఎక్కడి నుంచి పుట్టాయో కూడా తనకు తెలియదన్నాడు. తన దృష్టి మొత్తం సినిమాలపై ఉందన్న విశాల్.. ఏపీ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ఉద్దేశమే తనకు లేదని తెలిపాడు. అంతేకాకుండా చంద్రబాబుపై కుప్పంలో పోటీ చేసే ఉద్దేశం కూడా తనకు లేదని విశాల్ స్పష్టం చేశాడు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)