Chandrababu Naidu: మేం గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అయిపోతుంది, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు అతిపెద్ద సమస్య జగన్ అని అన్నారు. విభజన గాయాల కంటే దారుణంగా జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఓడిపోతేనే రాష్ట్రం బాగుపడుతుందని అన్నారు. టీడీపీ గేట్లు తెరిస్తే చాలు... వైసీపీ విలీనం అయిపోతుంది.... మేం గేట్లు తెరిచామంటే వైసీపీ కాస్తా టీడీపీగా మారిపోతుంది అని వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎప్పుడూ జాతీయ భావంతో ఉండే పార్టీ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. జాతీయ రాజకీయాలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు. తాను కేంద్రంతో విభేదించింది కేవలం ప్రత్యేక హోదా అంశంపైనే అని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా అంశాల్లో కేంద్రంతో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని ఉద్ఘాటించారు. ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పానని వివరించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)