Ayyanna Patrudu Arrest: సీఎంపై అనుచిత వ్యాఖ్యలు, టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు, 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు
ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే.
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడుని శుక్రవారం విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల గన్నవరం యువగళం మీటింగ్‌లో సీఎంతో పాటు ఇతర మంత్రులను అయ్యన్న దూషించిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి పేర్ని నాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయ్యన్నపై 153 A, 354 A1(4), 504, 505(2), 509 ఐపీఎస్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
కృష్ణా జిల్లా పోలీసులు... అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసి... కృష్ణా జిల్లాకు తరలించబోయారు. ఐతే... అనకాపల్లి, వేంపాడు దగ్గర టీడీపీ శ్రేణులు పోలీసులను అడ్డుకున్నాయి. వాగ్వాదం జరిగింది. దాంతో 41 ఏ నోటీస్ ఇచ్చిన పోలీసులు, అయన్నను అక్కడే వదిలి వెళ్లిపోయారు. దాంతో టీడీపీ శ్రేణులు అయన్ని హైవే పక్కన ఉన్న హోటల్‌కి తరలించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)