Bandaru Satyanarayana Murthy: గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలి, వైసీపీ నాయకులు బెదిరించడం వల్లే గుండెపోటు, సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే.. గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని బండారు డిమాండ్ చేశారు.
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ రెడ్డి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆ అనుమానాలు నివృత్తి కావాలంటే.. గౌతమ్ రెడ్డి మృతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని బండారు డిమాండ్ చేశారు. ఆయనను బెదిరించడం వల్లే గుండెపోటుకు గురయ్యారని.. పరిశ్రమలు తీసుకురావాలని గౌతంరెడ్డిని మానసిక క్షోభకు గురిచేశారని బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబాయ్‌లో వుండగా గౌతమ్‌రెడ్డిని బెదిరించింది ఎవరని బండారు ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే.. గుండెపోటు కారణంగా సోమవారం ఉదయం హఠాన్మరణం పొందిన గౌతమ్ రెడ్డి పార్ధివ దేహాన్ని ఈరోజు ఉదయం స్వగ్రామానికి తరలించారు అమెరికాలో ఉంటున్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి నెల్లూరు చేరుకున్నారు. బుధవారం ఉదయం గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)