Atchannaidu Audio Clip Video: లోకేష్‌ పాదయాత్రకు జనం లేరంటూ టీడీపీ నేతల మాట్లాడుకుంటున్న ఆడియో ఇదే, అచ్చెన్నాయుడితో బీమినేని చిట్టిబాబు ఫోన్‌లో సంభాషణ క్లిప్ వైరల్

తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకమంటూ ప్రచారం చేసిన లోకేష్‌ పాదయాత్ర జనం లేరంటూ టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అయింది. జిల్లానేతలతో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంభాషణ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Nara lokesh (Photo-Facebook))

తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ప్రతిష్టాత్మకమంటూ ప్రచారం చేసిన లోకేష్‌ పాదయాత్ర జనం లేరంటూ టీడీపీ నేతలు మాట్లాడుకుంటున్న ఆడియో లీక్ అయింది. జిల్లానేతలతో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన సంభాషణ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అచ్చెన్నాయుడితో జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇన్‌ఛార్జీ బీమినేని చిట్టిబాబు ఫోన్‌లో చెప్పిన అంశాలు వైరల్‌గా మారాయి.

ఈ ఆడియోలో "ఆఫీసులో పర్మిషన్‌ తీసుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగా ఉదయాన్నే నేను.. 8 గంటల కల్లా ఒక వెయ్యి మంది వచ్చేట్టుగా వెహికిల్స్‌తో అరేంజ్‌ చేశాను. రోజూ కూడా పాదయాత్ర స్టార్ట్‌ అయ్యేలోగా ఆరు మండలాల్లో.. 50 వెహికిల్స్‌ పెడతాం. 300 వెహికిల్స్‌కు అల్‌రెడీ డబ్బులు ఇచ్చేశాను. నాలుగు రోజులకు బుక్‌ చేశాను. దాని తర్వాత ప్రతీరోజు మూడు వేల మందిని తీసుకుని అక్కడకు రావాలని చెప్పాను అన్న" అని మాట్లాడుకున్నారు.అయితే దీనిపై టీడీపీ కాని అచ్చెన్నాయుడు కాని ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.

Here's Viral Audio Clip

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now