Three Capitals in AP: ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు, తిరుపతిలో కదం తొక్కిన ప్రజలు, రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం​ మారుమోగింది.

Rayalaseema Intellectual Forum holds a rally in Tirupati Photo-Twitter)

ఏపీలో అధికార వికేంద్రీకరణకు మద్దతుగా తిరుపతిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ మద్దతుగా నినాదాలతో తిరుపతి పట్టణం గురువారం​ మారుమోగింది. కృష్ణాపురం పోలీసు స్టేషన్‌ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు విద్యార్థులు, మేధావులు పెద్దఎత్తున ర్యాలీ చేపట్టారు. అడుగడుగున ‘ఒక రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ నినాదాలు చేశారు. వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఈ భారీ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా రాయలసీమ మేధావులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement