Vijayawada Bus Accident: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ప్రయాణికులపైకి దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు.. ముగ్గురు మృతి.. పలువురికి గాయాలు (వీడియోతో)
విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి.
Vijayawada, Nov 6: విజయవాడ (Vijayawada) ఆర్టీసీ బస్టాండ్ (RTC Bus Stand) లో ఘోర ప్రమాదం జరిగింది. బ్రేక్ ఫెయిలవ్వడంతో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ప్లాట్ ఫాంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. 12వ నంబర్ ప్లాట్ ఫాం వద్ద నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లడంతో కండక్టర్ తోపాటు ఓ మహిళ, 10 నెలల చిన్నారి మృతి చెందారు. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విజయవాడలోని ఆటోనగర్ డిపోకు చెందిన బస్సు.. గుంటూరు వెళ్లాల్సి ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన కండక్టర్ ను గుంటూరు-2 డిపోకు చెందిన వీరయ్యగా గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)