YS Sharmila on Tirupati Laddu: తిరుపతి లడ్డు వివాదం, చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన వైఎస్ షర్మిల, రాజకీయ కోణం లేకుంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని తెలిపారు.
తిరుమల శ్రీవెంకటేశ్వరుడి ప్రసాదం లడ్డూపై ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం నడుస్తోంది. ఈ పవిత్రమైన లడ్డూ ప్రసాదం తయారీకి జంతువుల నూనెలు వాడారని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం కలకలం రేపింది. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఖండించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని ఆమె హితవు పలికారు.
తిరుమలను అపవిత్రం చేస్తూ, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు నీచ రాజకీయాలు చేస్తున్నాయని ఆమె మండిపడ్డారు. సీఎం హోదాలో చంద్రబాబు వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు తిరుమల లడ్డూపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
చంద్రబాబు చేసిన ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే... భావోద్వేగం మీద రాజకీయం చేసే ఉద్దేశమే లేకుంటే.. నెయ్యికి బదులు జంతువుల నూనెలు నిజంగా వాడి ఉంటే... తక్షణమే ఉన్నత స్థాయి కమిటీ వేయాలని షర్మిల డిమాండ్ చేశారు.అలాగే సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.చంద్రబాబు తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉండాలని, నిజాలు నిగ్గు తేల్చాలని షర్మిల డిమాండ్ చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)