Tirumala Maha Shanti Yagam: వీడియోలు ఇవిగో, తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రారంభమైన మహా శాంతి యాగం, ఒక్క రోజు మాత్రమే యాగం
ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు.
శ్రీవారి ఆలయంలో (Tirumala) మహా శాంతి యాగం (Maha Shanthi Yagam) ప్రారంభమైంది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం (Homam) నిర్వహిస్తున్నారు. తిరుమల.. శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ కారణంగా శ్రీవారి ఆలయంలో హోమాన్ని నిర్వహిస్తున్నామని.. హోమం పూర్తి అయిన తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమాని నిర్వహిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు (TTD EO Shyamala Rao) తెలిపారు.
సోమవారం రోహిణి నక్షత్రం శ్రీవారికి ముహూర్త బలం కావడంతో.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మహా శాంతి హోమాన్ని నిర్వహిస్తారు. ముందుగా మహ శాంతి యాగం, వాస్తూ హోమం నిర్వహణ జరుగుతుంది. చివరిగా పంచగవ్యాలతో అర్చకులు సంప్రోక్షణ నిర్వహించనున్నారు. కాగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలకు ఆటంకం కలగకుండా ఒక్క రోజు మాత్రమే యాగం నిర్వహించేలా ఆగమ పండితులు నిర్ణయించారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)