Accident in Annamayya District: అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Road Accident (Representational Image)

Vijayawada, Sep 15: అన్నమయ్య జిల్లాలో (Annamayya District) ఘోర ప్రమాదం (Accident) జరిగింది. ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఆంబులెన్స్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. తవణంపల్లె మండలం తెల్లగుండ్ల పల్లి వద్ద ఘటన చోటు చేసుకుంది. వేలూరు నుంచి వస్తున్న కిమ్స్ హాస్పిటల్ అంబులెన్స్.. చిత్తూరు-తిరుపతి హైవే మీద ఆగి ఉన్న ట్యాంకర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళతో పాటు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆంబులెన్స్‌లో ఏడుగురు ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. గాయపడ్డ వాళ్లను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Aliens: మెక్సికో పార్లమెంటులోకి గ్రహాంతరవాసుల మృతదేహాలు.. తీసుకొచ్చి ప్రదర్శించిన పరిశోధకులు.. అసలు ఏంటా సంగతి??

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement