Andhra Pradesh Road Accident: వీడియో ఇదిగో, ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం, జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా, బస్తాల కింద పడి ఊపిరాడక ఏడు మంది మృతి

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారి పాకల వద్ద జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా పడింది.

DCM van overturned in Devarapalli, 7 people died in the accident

తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకావారి పాకల వద్ద జీడిగింజల లోడుతో వెళ్తున్న డీసిఎం వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 7 గురు మృతి చెందారు. టీ నరసాపురం మండలం బొర్రంపాలెం నుండి జీడిగింజల లోడుతో నిడదవోలు మండలం తాడిమళ్ళ వస్తు ఉండగా చిన్నాయిగూడెం శివారు వద్ద అదుపు తప్పి డిసిఎం వ్యాన్ బోల్తా పడింది.

దొంగతనానికి వచ్చి కరెంట్‌ షాక్‌తో ఇద్దరు దొంగలు మృతి, మహబూబ్‌నగర్‌లో షాకింగ్ సంఘటన

వ్యాన్ లో 10 మంది వుండగా జీడీ గింజల బస్తాల కింద చిక్కుకుని ఊపిరాడక ఏడుగురు మృతి చెందారు. ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. మృతి చెందిన ఏడుగురిలో 6గురు తాడిమళ్ళ గ్రామానికి చెందిన వారు కాగా..,ఒకరు కాటకోటేశ్వరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు,స్థానికుల సహాయంతో బస్తాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీశారు. మృత దేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement