Ramana Dikshitulu Meets AP CM: సీఎం జగన్‌ను మహావిష్ణువుతో పోల్చిన రమణ దీక్షితులు, సీఎంతో మర్యాదపూర్వక భేటీ, అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు
పదవీ విరమణ చేసిన అర్చకులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేయడంతో, రమణ దీక్షితులు తిరిగి టీటీడీ ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు నేడు సీఎం జగన్ ను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. అర్చకుల వంశపారంపర్య హక్కులను కాపాడారంటూ కృతజ్ఞతలు తెలిపారు.
సీఎం జగన్ ను ఘనంగా సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఇతర అర్చకులు కూడా సీఎంను కలిసి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగన్ ను మహావిష్ణువుతో పోల్చారు. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరామని తెలిపారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగడంలేదని, దేవస్థానం విషయాలను రాజకీయం చేయొద్దని హితవు పలికారు.
Advertisement
సంబంధిత వార్తలు
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Advertisement
Advertisement
Advertisement