Chandrababu Naidu: చంద్రబాబు అరెస్ట్ సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో, నిప్పులా బతికాను నేను ఏతప్పూ చేయలేదు, అయినా రేపో మాపో నన్ను అరెస్ట్ చేస్తారని వెల్లడి

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Chandrababu Naidu (Photo-X TDP)

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో అన్నీ అరాచకాలే అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆస్తుల దోపిడీ జరిగిందని ఆరోపించారు.

వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు చూస్తూనే ఉన్నారు. జగన్‌.. సైకో సీఎం మాత్రమే కాదు... కరడుగట్టిన సైకో. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇసుక అక్రమాలపై NGTలో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారు. రేపో, ఎల్లుండో నన్ను అరెస్టు చేయొచ్చు. లేకుంటే దాడి చేస్తారు. నిప్పులా బతికాను.. నేను ఏ తప్పూ చేయలేదు’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Chandrababu Naidu (Photo-Video Grab)

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement