Vijayawada Floods: వీడియో ఇదిగో, బుడమేరు వరద దెబ్బకి నీళ్లలో మునిగిపోయిన వందలాది కొత్త కార్లు, విజయవాడ శివారులోని కార్ల గోడౌన్లను ముంచెత్తిన వరదలు
కృష్ణాజిల్లా గన్నవరం బుడమేరు వరద దెబ్బకి కొత్త కార్లు నీళ్లపాలయ్యాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కార్ల గోడౌన్ల ను వరద నీరు ముంచెత్తడంతో కార్లు నీటిలో తేలుతున్నాయి.కొత్త కార్లు అన్నీ వరద నీటిలో 3 రోజులుగా నానుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.
భారీ వర్షాలతో విజయవాడ విలవిలలాడింది. బెజవాడ మొత్తం వరద నీటిలో చిక్కుకుపోయింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో బెజవాడ వాసులకు కష్టాలు రెట్టింపయ్యాయి. కృష్ణాజిల్లా గన్నవరం బుడమేరు వరద దెబ్బకి కొత్త కార్లు నీళ్లపాలయ్యాయి. విజయవాడ శివారు ప్రాంతాల్లో ఉన్న కార్ల గోడౌన్ల ను వరద నీరు ముంచెత్తడంతో కార్లు నీటిలో తేలుతున్నాయి.కొత్త కార్లు అన్నీ వరద నీటిలో 3 రోజులుగా నానుతున్న పరిస్థితి అక్కడ నెలకొని ఉంది.టాటా కార్స్ వాల్యూ లారీలు నీట మునిగాయి.కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. వీడియో ఇదిగో, కరకట్ట మీద నీట మునిగిన మంతెన సత్యనారాయణ ఆశ్రమం, భవానిపురానికి పొంచి ఉన్న వరద ముప్పు
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)