Visakhapatnam: వీడియో ఇదిగో, మద్యం ఇవ్వలేదని ఏకంగా వైన్ షాప్‌ను తగలబెట్టాడు, మంటల్లో పూర్తిగా కాలిపోయిన షాపు, రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం
మద్యం ఇవ్వలేదని వైన్ షాప్‌ను తగలబెట్టిన ఘటన విశాఖపట్నం మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మధు అనే ఓ వ్యక్తి మద్యం కోసం మధురవాడ ప్రాంతంలోని ఓ వైన్ షాప్ వద్దకు వచ్చాడు. అయితే అప్పటికే షాప్ మూతపడే సమయంలో కావడంతో సిబ్బంది అతనికి మద్యం ఇవ్వలేదు.

దీంతో వారితో వాగ్వాదానికి దిగిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయి ఆదివారం సాయంత్రం పెట్రోల్ డబ్బాతో వచ్చిన అతను వైన్‌షాప్ లోపల, సిబ్బందిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో సిబ్బంది వెంటనే షాప్ బయటకు పరుగులు తీశారు. కానీ వైన్‌షాప్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న కంప్యూటర్, ప్రింటర్ ఇతర సామగ్రి కాలిపోయి రూ.1.5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)