Visakhapatnam: వీడియో ఇదిగో, ప్రభుత్వ హాస్టల్ గోడదూకి 31న రాత్రి మందు పార్టీ చేసుకున్న ఆరో తరగతి విద్యార్థులు
విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి
విశాఖపట్నం పరిధిలోని అనకాపల్లి జిల్లా చోడవరంలో ఆరు నుంచి పది చదువుతున్న 16 మంది విద్యార్థులు డిసెంబరు 31న రాత్రి ఫుల్లుగా మందుకొట్టి నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. హాస్టల్ నుంచి గోడదూకి బయటకు వచ్చి విద్యార్థులు మరో ఇద్దరు యువకులతో కలిసి హాస్టల్ పక్కనే నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఎంచక్కా మందుపార్టీ చేసుకున్నారు.
బిర్యానీ తెచ్చుకుని మందు తాగుతూ రాత్రంతా అక్కడే గడిపేశారు. శనివారం రాత్రి మొదలైన పార్టీ ఆదివారం కూడా కొనసాగింది. తింటూ, తాగుతూ అల్లరికి దిగడంతో గమనించిన ఏసీ మెకానిక్, డ్రైవింగ్ స్కూల్ డ్రైవర్ ఒకరు ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. తమను ఫొటోలు తీస్తున్న వారిని విద్యార్థులు హెచ్చరించడంతోపాటు మెకానిక్‌పై దాడిచేసి గాయపరిచారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)