CM Jagan on AP Election Results: వీడియో ఇదిగో, 151 ఎమ్మెల్యే స్థానాలకు పైన గెలవబోతున్నాం, 22 ఎంపీ స్థానాలకు మించి విక్టరీ కొడుతున్నాం, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్

వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు.

CM Jagan Mohan Reddy (photo-X/YCP)

ఏపీలో అధికార వైసీపీ మరోసారి ప్రభంజనం సృష్టించబోతోందని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. వైసీపీ గత చరిత్రను తిరగరాస్తూ మళ్లీ అధికారంలోకి రాబోతోందని చెప్పారు. గత ఎన్నికల కంటే వైసీపీ అధిక సీట్లలో గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మనం చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పారు. విజయవాడ బెంజ్ సర్కిల్ లో ఉన్న ఐప్యాక్ కార్యాలయానికి జగన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల ఫలితాలను అంచనా వేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లను గెలిచామని... ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని జగన్ అన్నారు.  ఏపీలో మనం కొట్టే సీట్లతో ప్రశాంత్ కిషోర్ మైండ్ బ్లాక్ అయిపోద్ది, ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)